KMR: జక్కల్ మండల వ్యవసాయ అధికారి వినోద్, పిట్లంలోని ప్రాథమిక సహకార సంఘం చిల్లర్గిలో ఆదివారం యూరియా పంపిణీని పర్యవేక్షించారు. మండలంలో యూరియా కొరత లేదని, ప్రాథమిక సహకార సంఘాల వద్ద 2664 బ్యాగులు (120 MTలు), ప్రైవేట్ డీలర్ల వద్ద 6800 బ్యాగులు (305 MTలు) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇకపై సహకార సంఘాలలో రెగ్యులర్గా యూరియా వస్తుందన్నారు.