VZM: బొబ్బిలి మండలంలో ఈరోజు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు MPDO రవికుమార్ తెలిపారు. ఈ సభల్లో MGNREGA స్థానంలో అమలులోకి వచ్చిన వీబీ-జీ-రామ్ జీ పథకంపై అవగాహనతో పాటు నూతన మార్గదర్శకాలను వివరించనున్నట్లు చెప్పారు. సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత, గ్రామ ప్రజలు హాజరుకావాలని ఆయన సూచించారు.