Gangs of Godavari Movie Review: విశ్వక్ హిట్ కొట్టాడా? లేదా?
విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి, అంజలి హరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఎన్నో అంచనాల నడుమ నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మూవీ ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో చూద్దాం.
సమ్మర్ అంతా పెద్ద సినిమాలు లేక ఈ మధ్య సింగిల్ స్క్రీనులు మూతపడిన విషయం తెలిసిందే. నేడు మూడు పెద్ద సినిమాలు విడుదల కావడంతో థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. వీటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి. విష్వక్సేన్(Vishwak sen) హీరోగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పథాకంపై ఈ చిత్రం వస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ మూవీ ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ సైతం ఆకట్టుకున్నాయి. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
గోదావరి జిల్లాలో లంకల రత్నాకర్ అనే యువకుడు ఎలాగైనా ఎదగాలి అనే లక్ష్యంతో బతుకుతుంటాడు. చిన్నప్పుడు వాళ్ల నాన్న చెప్పిన ఎదగడం మన హక్కు అనే మాటను బలంగా నమ్మిన లంకల రత్నాకర్ (విష్వక్ సేన్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. తనకు మానవత్వం లాంటి ఎమోషన్స్ పెద్దగా ఉండవు. తాను ఎదగడానికి ఎదుటివాళ్లను సైతం వాడుకుంటాడు. అలా దొంగతనాలు చేసుకుంటూ బతికే రత్నాకర్ స్థానిక ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ)కి కుడిభుజంగా ఎదుగుతాడు. అదే సమయంలో దొరసామి, నానాజీల మధ్య రాజకీయ వైరం నడుస్తుంది. వీరి గొడవలోకి రత్నాకర్ వస్తాడు. తాను రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకొంటాడు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది. అసలు బుజ్జి(నేహాశెట్టి), రత్నమాల (అంజలి) ఇద్దరు ఎవరు? వారితో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? తాను అనుకున్నట్లు ఎదిగాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
గోదావరి నేపథ్యంలో సినిమా అనగానే మనం ఊహించేది దానికి భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ సాగుతుంది. లంక గ్రామాల్లో కత్తి పట్టే సంప్రదాయం సన్నివేశాల్ని చూపిట్టిన దర్శకుడు ల్యాగ్ లేకుండా కథను చెప్పుతాడు. లంకలో రాజకీయాలు, ఆధిపత్య పోరు, పగ, ప్రతీకారాలను అద్భుతంగా చూపించాడు. వీటితో లంకల రత్నంకు ముడిపెడుతూ కథను చాలా బాగా రాసుకున్నాడు. ప్రతీ పాత్రకీ ఓ ప్రయాణం ఉంటుంది. అది సినిమాకు కలిసొచ్చింది. అయితే అన్ని పాత్రాల్లో విష్వక్సేన్, అంజలి పాత్రలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. మిగతా పాత్రాలు పెద్దగా ఆకట్టుకోవు. సినిమాలకు భావోద్వేగాలే బలం. ఈ సినిమాలో అవి కాస్త లోపించాయి అనిపిస్తాయి.
చాలా సన్నివేశాలు చాలా నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రల్లో పెద్దగా బలం లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. ఇక హీరోయిన్ నేహాశెట్టి పాత్రలో ఆశించిన భావోద్వేగాలు పండలేదు. మంచి విజువల్స్, మంచి సంగీతంతో ఉన్నా పెద్దగా ఆకట్టుకోవు. సన్నివేశాలు అలా వెలుతుంటాయి అంతే. అయితే ఈ పొలిటికల్ వార్‌లో హీరో వేసే ప్లాన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. వాటిపై ఇంకాస్త శ్రద్ద పెట్టింటే బాగుండేది. మాస్ పాత్ర వేయడంలో విశ్వక్ ముందు నుంచే మెప్పించాడు. ఈ సినిమాలో కూడా మెప్పించాడు కానీ సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా రాసుకున్నట్లు అనిపిస్తుంది. హీరో ఎదిగే తీరును ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు కానీ లాజిక్ వెతికితే కష్టమే.
ఎవరెలా చేశారంటే?
లంకల రత్నాకర్‌గా విష్వక్సేన్ (Vishwak sen) అద్భుతంగా నటించాడు. చాలా రోజుల నుంచి మాస్ పాత్రకోసం ఎదురు చూస్తున్న విశ్వక్‌కు ఈ పాత్ర సరిపోతుంది. అందుకే ఈ పాత్రలో విశ్వక్ బాగా నటించాడు. పోరాటాలు, పాటలు చేసేప్పుడు చాలా హుషారుగా చేశాడు. ఇందులో అంజలి పాత్ర అర్థవంతంగా ఉంటుంది. ముందు నుంచి చెప్పినట్లు గుర్తుండిపోయే పాత్రనే అంజలి చేశారు. నేహాశెట్టి అందంలో మెప్పించింది కానీ తన పాత్రకోణం పెద్దగా ఆకట్టుకోలేదు. మిగితా నటులు నాజర్, గోపరాజు రమణ, సాయికుమార్, ప్రవీణ్, పమ్మి సాయి, హైపర్ ఆది తదితరులు తమకు ఉన్నంతలో మెప్పించారు.
సాంకేతిక అంశాలు:
సాంకేతిక విభాగాలే ప్రధాన బలం. సినిమాటోగ్రఫి అత్యంత అద్భుతంగా ఉంది. 1990లో జరిగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగానే విజువల్స్ క్రియేట్ చేశారు. ప్రతీ ఫ్రేమ్ మెప్పిస్తుంది. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం, పాటలు మెప్పిస్తాయి. బీజీఎం అదిరిపోయింది. అలాగే ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. రచయితగా ఇంకా కొంచం శ్రద్దపెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే డైరెక్షన్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
ప్లస్‌లు
విష్వక్సేన్ నటన
కథా నేపథ్యం
సినిమాటోగ్రఫి
మ్యూజిక్