MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలను శనివారం ఎస్ఎఫ్ఐ బయ్యారం మండల కమిటీ సందర్శించింది. విద్యార్థులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్వెటర్లు, రగ్గులు పంపిణీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు.