W.G: పాలకోడేరు మండల పరిషత్ సమావేశంలో రాజ్యసభసభ్యుడు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. నామ మాత్రంగా సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన పరిష్కార మార్గాన్ని చూసినప్పుడే సమావేశాల నిర్వహణకు అర్థం ఉంటుందన్నారు. పాకాను ఈ సందర్భంగా సన్మానించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పాల్గొన్నారు.