KNR: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తన హామీలతో ఆకట్టుకుంటున్నారు. గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో మార్గం మల్లేశం బరిలో నిలిచారు. తనను సర్పంచ్ గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే మాదాపూర్ మహాలక్ష్మి పథకం పేరుతో ఆ బిడ్డ పేరిట రూ.5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.