ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు భారతీయ రైల్వే శాఖ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లను నడపిస్తోంది. దీంతో ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ప్రయాణికులకు ఊరట లభించింది. సికింద్రాబాద్- చెన్నై, చర్లపల్లి- కోల్కతా, హైదరాబాద్- ముంబైకి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.