ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో నిన్నటి దినం వైయస్సార్ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం రూరల్ సీఐ వెంకటరమణ మీడియాకు నిందితుడి వివరాలు వివరించారు. కలేకుర్తి గ్రామానికి చెందిన బోయ ధనుంజయ నిన్నటి దినం మద్యం మత్తులో ఇతరులపై గొడవ పడుతూ వైఎస్సార్ విగ్రహం చేతిని పాక్షకంగా ధ్వంసం చేశారన్నారు.