WGL: వరధనపేట పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఇవాళ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అదనపు ఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకట భాస్కర్, సీఐ కిశోర్, పీసీ కిరణ్ పాల్గొన్నారు. ఈ తనిఖీలో రోగుల ఆహార నాణ్యత, పరిమాణం, మెనూ అనుసరణ, రికార్డులు పరిశీలించారు. రోగుల అభిప్రాయాలు సేకరించి ఆసుపత్రి పరిపాలనపై సమగ్ర విచారణ చేపట్టారు.