W.G: ఉపాధ్యాయ క్రీడోత్సవాలు కాళ్ల మండల పరిధిలో ఘనంగా నిర్వహించడం హర్షనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ అన్నారు. కోపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇవాళ జరిగిన కాళ్ళ మండల స్థాయి ఉపాధ్యాయుల ఆటల పోటీల్లో విజేతలకు ఆయన చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.