WGL: రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ శిబిరాన్ని ఇవాళ కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, ఉద్యోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు.