SKLM: దేశస్థాయిలో నిర్వహించిన అతి పెద్ద సైన్స్ ఆన్లైన్ టాలెంట్ టెస్ట్‌లో శ్రీకాకుళం చెందిన ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో విద్యార్థి విజ్ఞాన్ మందన్ (VVM)టెస్ట్ రెండవ విడత నిర్వహించారని, అందులో వారణాసి పూజిత, గిరివర్ధన్ విగ్నేష్, దున్న వినూత్న ప్రతిభ కనపరిచారని పేర్కొన్నారు.