MDK: చేగుంట హైస్కూల్ విద్యార్థి గాయత్రి రగ్బీ పోటీలలో జాతీయస్థాయికి ఎంపికకాగా, ఎంఈవో నీరజ అభినందించారు. మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్లో నిర్వహించిన రగ్బీ పోటీలలో మెదక్ జిల్లా తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలలో నరేష్, దివ్య ఉత్తమ ప్రతిభ కనబరచగా, గాయత్రి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు.