విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. జైస్వాల్(116*) సూపర్ సెంచరీ సాధించగా, రోహిత్(75), కోహ్లీ(65*) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.