MNCL: కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో గురువారం స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. సర్పంచ్ సింధూజ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా DLPO సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు బ్యాంకు ప్రారంభించామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పంచాయతీ నుంచే మార్పు మొదలు కావాలని పిలుపునిచ్చారు. ఉపసర్పంచ్ చంద్రకళ, కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.