BPHL: చిట్యాల విద్యుత్ కార్యాలయంలో జాతీయ లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ADE సురేందర్ మాట్లాడుతూ.. నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగేందుకు లైన్మెన్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఎండ, వర్షం అనే తేడా లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు.