JGL సూరమ్మ ప్రాజెక్టు కాల్వ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఇప్పపెల్లి రైతులు డిమాండ్ చేశారు. కథలాపూర్ మండల కేంద్రంలో ఇప్పపెల్లికి చెందిన భూనిర్వాసితులతో కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, తాము సాగు భూములను నమ్ముకొని జీవిస్తున్నామన్నారు.