టీమిండియా యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ తన తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో 111 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 6వ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.