KMR: బిచ్కుందలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల కోరికలు నెరవేరాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.