BDK: దమ్మపేట మండలంలోని తాటిసుబ్బన్నగూడెం గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇంఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు స్వగ్రామమైన ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ నేత సవలం స్వాతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల ఐక్యత, పార్టీపై విశ్వాసం, గత అభివృద్ధి పట్ల గుర్తింపు వల్లే బీఆర్ఎస్ ఆధిపత్యం మరోసారి రుజువైందని అన్నారు.