ప్రకాశం: కంభంలోని పలు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏ.ఈ నరసయ్య తెలిపారు. ఇన్ లైన్ పోల్స్, ఎర్త్ దిమ్మెలు, నూతన ఏబీ స్విచ్లు ఏర్పాటు కొరకు పట్టణంలోని ఆల్ఫా స్కూల్ న్యూ క్యాంపస్, యశస్విని హాస్పిటల్, ఏవి ఫంక్షన్ హాల్, మనన్ ఫంక్షన్ హాల్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.