NLG: రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ డిసెంబర్ 15, 16 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. చల్లో ఢిల్లీకి సంబంధించిన గోడ పత్రికలను మిర్యాలగూడలోని అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు.