PDPL: సింగరేణి సంస్థలో ఫైనాన్స్ మేనేజర్ గా విధులు నిర్వహించి ఎన్టీపీసీ పరిశ్రమకు బదిలీ అయిన మోహన్ రావును రామగుండం జీఎం కార్యాలయంలో సన్మానించారు. అంకితభావం, పనితనం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన ఆయన సేవలను అధికారులు ప్రశంసించారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సాయి ప్రసాద్, సాంబశివరావు, బ్రహ్మాజీరావు, వీరారెడ్డి, వేణు, పాల్గొన్నారు.