విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ T20ల్లో ఈ ఏడాదిలో 100 సిక్సర్లు (36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచాడు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదాడు. ఇక ఈ ఏడాది T20ల్లో అభిషేక్ 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.