PPM: జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సోమవారం జరగనున్న పీజీఆర్ఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్ది తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.