»Koo Indias Social Media App Is Shutting Down As Dailyhunt Talks Fail Report
Koo app : మూత పడ్డ ‘కూ యాప్’
ఎక్స్‌కు పోటీగా భారత్‌లో అవతరించిన కూ యాప్ మూత పడింది. డైలీ హంట్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Koo social media app is shutting down : భారత్‌లో తయారైన దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూత పడింది. కంపెనీని అమ్మేయడానికి ఈ సంస్థ గత కొంత కాలంలో డైలీ హంట్(Dailyhunt) సంస్థతో మంతనాలు జరుపుతూ ఉంది. ఆ చర్చలు విఫలం కావడంతో చివరికి సంస్థను మూసి వేస్తున్నట్లు ఫౌండర్ అప్రమేయ రాధా కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లింక్డిన్ పోస్ట్ పెట్టారు.
కూ యాప్(Koo app) 2019లో ప్రారంభం అయ్యింది. మయాంకర్ బిడవట్కా, అప్రమేయ రాధాకృష్ణలు కలిసి దీన్ని ప్రారంభించారు. టిట్టర్కి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొస్తున్నట్లు వారు తెలిపారు. అయితే రైలుల ఉద్యమం సమయంలో అకౌంట్ల బ్లాక్ విషయంలో కేంద్రానికి, ట్విట్టర్‌కి మధ్య వివావదం నెలకొంది. ఆ సమయంలో కూ యాప్ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆత్మనిర్బర్ యాప్ అంటూ స్వయంగా కేంద్ర మంత్రులే స్వయంగా దీన్ని ప్రమోట్ చేశారు. దీంతో ఈ యాప్‌ని వినియోగించే వారి సంఖ్య కూడా అనతి కాలంలోనే పెరిగింది.
భారత్‌లోనే కాకుండా బ్రెజిల్, నైజీరియా లాంటి దేశాల్లోనూ తమ సంస్థను విస్తరించింది. అక్కడా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమూ భారంగా మారింది. దీంతో ఈ ఏడాది మొదట్లో లేఆఫ్‌లు ఇచ్చింది. చివరికి సంస్థను అమ్మేసేందుకు ప్రయత్నాలు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో మంతనాలు చేసింది. అయినా ఫలితం లేదు. దీంతో లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్ బై చెబుతోందంటూ ఫౌండర్ లింక్డిన్లో బుధవారం పోస్ట్ పెట్టారు.