పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) శాసన సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పారు.వారి వేతనలు నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు బంగాల్ అసెంబ్లీ(Assembly)లో ఓ ప్రకటన చేశారు.ఇతర రాష్ట్రాలలో జీతలతో పోలిస్తే ఎమ్మెల్యే తక్కువగా ఉన్నట్లు మమత చెప్పారు. అందువల్ల ఎమ్మెల్యేల జీతాలు (Salaries) రూ.40వేలు పెంచినట్లు తెలిపారు. రూ.40వేల పెంపు తర్వాత భత్యాలు, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అదనపు చెల్లింపులతో కలిపి ఎమ్మెల్యేల మొత్తం జీతం ఎంతో మాత్రం వెల్లడించలేదు. అయితే ముఖ్యమంత్రి జీతంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. చాలాకాలం నుంచి ఆమె జీతం తీసుకోవడం లేదు.
పెంపు నిర్ణయం ప్రకటన తర్వాత ఎమ్మెల్యే(MLA)ల వేతనాలు ప్రస్తుతం ఉన్న రూ.10వేల నుండి రూ.50వేలకు పెరగనున్నాయి. మంత్రుల జీతాలు రూ.10,900 నుండి రూ.50,900కు పెరగనున్నాయి. కేబినెట్(Cabinet)మంత్రుల వేతనాలు రూ.11వేల నుండి రూ.51వేలకు పెరగనున్నాయి. అలవెన్స్లు, ఇతర ప్రయోజనాలు అదనం. వాటిని కలుపుకుంటే ఎమ్మెల్యేలకు రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు అందనున్నాయి. బంగాల్ కొత్త సంవత్సరం పొయిలా బైసాఖ్(Baisakh)ను ఆ రాష్ట్ర దినోత్సవంగా పాటించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది బంగాల్ అసెంబ్లీ.
అయితే ఈ తీర్మానానికి గవర్నర్ ఆమోదం లభించకపోయినా.. అదే రోజు బంగాల్ డేగా పాటిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.రూల్ 169 కింద పొయిలా భైసాఖ్ను బంగాల్ దినోత్సవంగా, రవీంద్రనాథ్ ఠాగూర్(Tagore)రచించిన ‘బంగ్లార్ మాట్, బంగ్లార్ జోల్’ రాష్ట్ర గీతంగా పాటించాలని మమత సర్కార్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 294 మంది సభ్యుల్లో 167 మంది.. ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. జూన్ 20వ తేదీని రాష్ట్ర దినోత్సవంగా పాటించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీకి చెందిన 62 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐఎస్ఎఫ్ (ISF)ఏకైక ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు.