Jawan movie review: జవాన్ మూవీ రివ్యూ..హిట్టా, ఫట్టా?
పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాక్సాఫీసు మీద దండయాత్రకు వచ్చాడు. ఇటీవల పఠాన్ సినిమా(Pathan movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ జవాన్‌గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి నిరీక్షణకు తెర పడింది. బాలీవుడ్ బాద్షా హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్(Jawan)’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. హిందీతో తెలుగు, తమిళ భాషల్లో విడదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ ఏమిటంటే:
మూవీ ఓపెనింగ్ ఒక మెట్రో ట్రైన్ హైజాక్ తో ప్రారంభం అవుతుంది. ఆరుగురు యువతులు జైలర్ ఆజాద్(షారుఖ్) తో కూడిన ఒక టీం ఆ మెట్రో ట్రైన్ ను హైజాక్ చేసి అందులో అలియా అనే అమ్మాయి తండ్రి, బిజినెస్ మేన్ కాళీ గైక్వాడ్( విజయ్ సేతుపతి) నుంచి నలభై వేల కోట్లు డిమాండ్ చేస్తాడు. వచ్చిన డబ్బులతో రైతుల రుణమాఫీ చేసి తన పేరు విక్రమ్ రాథోడ్ అని అందరికీ రివీల్ చేస్తాడు. అదే తరహాలో ఆరోగ్య శాఖా మంత్రిని సైతం కిడ్నాప్ చేసి ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తాడు. అయితే ఇవేం చెప్పకుండానే జైలర్ ఆజాద్ నర్మద (నయనతార)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ప్రజల్లో హీరోలా మారుతున్న అతన్ని పట్టుకోవాలని అటు ప్రభుత్వం, కాళీ కష్టపడి అతన్ని ట్రాప్ చేసి చంపబోతే అతని తండ్రి విక్రమ్ రాథోడ్ (షారుఖ్) ఎంట్రీ ఇస్తాడు. అసలు విక్రమ్ రాథోడ్ ఎవరు? జైలర్ ఆజాద్ ఎవరు? వీరికి సంబంధం ఏమిటి? అసలు కాళీ గైక్వాడ్ ఎందుకు విక్రమ్ రాథోడ్ ను చంపాలి అనుకున్నాడు? లాంటి విశేషాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆర్మీలో పని చేసే నిజాయితీ గల ఒక వ్యక్తి దేశద్రోహిగా చిత్రీకరించబడి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, అతను దేశద్రోహి కాదు అని నిరూపించేందుకు అతని కొడుకు ప్రయత్నించడం అనే స్టోరితో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. జవాన్ కూడా పూర్తిగా అదే లైన్ తో వచ్చిన సినిమా. విక్రమ్ రాథోడ్ అనే స్పెషల్ ఫోర్స్ కి సంబంధించిన వ్యక్తి ఆర్మీలో జరిగిన ఒక అవినీతి బయటపెట్టిన క్రమంలో ఆర్మీలో కొందరికి టార్గెట్ గా మారి దారుణంగా హత్య చేయబడతాడు. ఆ తర్వాత కొన ఊపిరితో ఒక కుగ్రామానికి చేరి అక్కడి వారి వల్ల రక్షింపబడతాడు. కథ ఎక్కడా కొత్తగా అనిపించకపోయినా హీరో ఎలివేషన్లతో చాలావరకు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అట్లీ.
నిజానికి షారుఖ్ ఖాన్ లాంటి హీరో దొరికినప్పుడు ఏదైనా కొత్త కథతో ప్రయోగం చేసాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అట్లీ మాత్రం ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సంప్రదాయంగా, రొటీన్ గా మనం ఇప్పటికే చూసిన ఎన్నో కథలను సమహారంగా చేసి బాలీవుడ్ ప్రేక్షకులకు ఒక ఫీస్టులాగా అందించే ప్రయత్నం చేశాడు. ఈ సమాజంలో ఉన్న రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల లేమి, బ్యాంకులు లేని వారిని ఎలా వేధిస్తున్నాయి అనే విషయాలను హృదయాలకు టచ్ అయ్యే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి చాలావరకు అట్లీ సఫలమయ్యాడు. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా సినిమాని చూపిస్తూనే మరోపక్క సోషల్ మెసేజ్ ఇస్తూ రెండు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. కథలో చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ మొత్తం ప్రేక్షకులను అలరించే విధంగా సాగింది.
ఎవరెలా చేశారంటే
సినిమా మొత్తం మీద సౌత్ మార్క్ చాలా స్పష్టంగా కనిపించింది. షారుఖ్ తో పలికించిన డైలాగులు కొన్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా షారుఖ్ లోని కామెడీ టైమింగ్ ని కూడా బాగా వాడుకున్నాడు అట్లీ. రొటీన్ కథే అయినా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా.. అటు భావోద్వేగాలతో.. ఇటు యాక్షన్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. జవాన్ కథ పాతదైనా.. షారుఖ్ ఖాన్ సినిమా కోసం ప్రాణం పెట్టినట్టు అనిపించింది. డైలాగ్ వెర్షన్ చాలా బావుంది. అనిరుద్ రవి చందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బాంప్స్ తెప్పించింది. కానీ పాటలు మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. విజయ్ సేతుపతి కూడా తనకు బాగా అచ్చొచ్చిన విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. కానీ విజయ్ సేతుపతినీ డామినేట్ చేసే విధంగా షారుఖ్ నటన ఉంది. దీపికా కనిపించింది కొంతసేపే అయినా షారుఖ్ తో కెమిస్ట్రీ బాగుంది. ప్రియమణి పాత్ర కూడా బాగా డిజైన్ చేశారు ప్రియమణి ఆకట్టుకునేలా నటించింది. మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్లు:
+షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి
+ఇంటర్వెల్
+బ్యాక్ గ్రౌండ్ స్కోర్
+యాక్షన్ సీన్స్