»Aamir Khan Salman Khan Shahrukh Khan Dance To Natunatu Song At Ambanis Wedding Event
Natunatu song: అంబానీ ఈవెంట్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన బాలీవుడ్ ఖాన్లు
బాలీవుడ్ దిగ్గజ నటులు ముగ్గురు ఖాన్లు ఒకే వేడుకలో కనిపించడమే చాలా అరుదు అలాంటిది ఈ ముగ్గురు ఒకే స్టేజీపై ఒకే పాటకు డ్యాన్స్ చేశారు. అస్కార్ విన్నింగ్ నాటునాటు పాటకు స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Aamir Khan, Salman Khan, Shahrukh Khan dance to Natunatu song at Ambani's wedding event
Natunatu song: ముఖేష్ అంబానీ(Mukhesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ మొత్తం సెలబ్రెటీలతో కలకలలాడుతుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. పాప్ సింగర్ గ్రామీ అవార్డు గ్రహిత రిహన్న పాటతో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్(Aamir Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), షారుక్ ఖాన్(Shahrukh Khan) ముగ్గురు కూడా ఒకే పాటకు డ్యాన్స్ చేశారు. ఆస్కార్ అవార్డు సాధించిన తెలుగు పాట నాటునాటుకు ముగ్గురు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది.
ఈ మగ్గురు స్టార్స్ డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఖాన్‌లను ఒకే స్టేజ్‌పై తీసుకురావడం బాలీవుడ్ దిగ్గజ నిర్మాతలకు కూడా సాధ్యం కాలేదు అని, కానీ అది ముఖేష్ అంబానీకి మాత్రమే సాధ్యం అని అంటున్నారు. అత్యంత వైభంగా జరుగుతున్న ఈ వేడుకకు బిల్గేడ్స్, మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ సైతం హాజరయ్యారు. బాలీవుడ్ మొత్తం జామ్నగర్లోనే ఉంది. మన టాలీవుడ్ నుంచి కూడా అనేక మంది అతిథులు హాజరయ్యారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు, మహింద్రసింగ్ ధోనితో కలిసి ఫోటోలు దిగారు. దేశవ్యాప్తంగా ఈ వేడుక ట్రెండ్ అవుతుంది. కుబేరుడి కొడుకు పెళ్లంటే ఈ మాత్రం ఉండాలి కదా అంటున్నారు నెటిజన్లు.