Mary Christmas: విజయ్ సేతుపతి, అందాల హీరోయిన్ కత్రినా కైఫ్ కలిసి నటించిన తాజా చిత్రం మేరీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో మిస్టిరీయస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే ఓ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లో పెద్దగా ఆడలేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 8న స్ట్రీమింగ్కు సిద్ధం అయినట్లు ఆ ఓటీటీ సంస్థ కొత్త పోస్టర్ విడుదల చేసింది.
ఏడేళ్లు జైలులో ఉన్న అల్బర్ట్ (విజయ్ సేతుపతి) చనిపోయిన అమ్మ జ్ఞాపకాలతో ముంబయి నగరంలోని ఓ హోటల్‌కు వెళతాడు. అక్కడే మరియా (కత్రినా) కలుస్తుంది. తానొక ఆర్కిటెక్ట్ అని అబద్దం చెబుతాడు. మరియా భర్త జెరోమీపై ద్వేషంతో అల్బర్ట్‌ను డేట్ కోసం ఇంటికి తీసుకొస్తుంది. అదేసమయంలో జెరోమీ డెడ్‌బాడీ ఇంట్లో కనిపిస్తుంది. ఎవరో షూట్ చేసి చంపేశారని మరియా పోలీసులకు ఫోన్ చేయబోతే అల్బర్ట్ వద్దని వారిస్తాడు. ఎందుకంటే అసలు విషయం చెబుతాడు. తానో ఖైదీని అని ఇక్కడికి పోలీసులు వస్తే నీకే ప్రమాదం అని చెప్పడంతో అల్బర్ట్‌ను ఇంట్లో నుంచి పంపిచేస్తుంది మరియా. ఆ తర్వాత రోనీ అనే మరో వ్యక్తిని ఇంటికి తీసుకొస్తుంది. అసలు మరియా ఇంట్లో ఏం జరిగింది? జెరోమీని చంపింది ఎవరు? అల్బర్ట్ ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని గతం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.