These are the ministers in CM Chandrababu's cabinet
APPolitics: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తరువాత జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి శాసన సభ్యుడు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తరువాత టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవింద్ర, నాదేండ్ల మనోహర్, పొంగురు నారాయణ, అనిత వంగలపుడి, సత్య కుమార్ యాదవ్, డా. నిమ్మల రామానాయుడు, నాస్యం మహ్మాద్ ఫరూక్, అన్న రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డా. డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవిందర్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యా రాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీ, జీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రులగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రలలో 3 మహిళలకు ప్రధాన్యం ఇచ్చారు.