»700 Myanmar Nationals Entered Manipur In 2 Days Assam Rifles Gets Strict Advice Push Back
Myanmar నుంచి అక్రమ చొరబాటు, మణిపూర్ ఘర్షణలకు ఆ 718 మందే కారణమా…?
మణిపూర్ రగిలిపోతుంది. రిజర్వేషన్ల కోసం రెండు వర్గాల గొడవలోకి.. శరణార్థులు ప్రవేశించారని తెలిసింది. 718 మంది సరైన ధృవపత్రాలు లేకుండా దేశంలోకి వచ్చి.. గొడవలకు కారణం అని తెలిసింది.
Myanmar nationals: మణిపూర్‌లో (Manipur) హింస చల్లారడం లేదు. రిజర్వేషన్ల కోసం మొదలైన రగడ హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల గొడవతో రాష్ట్రంలో అశాంతి నెలకొంది. గత రెండు మూడు రోజుల నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ఇందుకు గల కారణం మయన్మార్ (Myanmar) నుంచి 718 మంది రావడమేనని తెలిసింది. ఇందులో 301 మంది చిన్నారులు ఉన్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా.. ఈ నెల 22, 23వ తేదీల్లో వీరు భారతదేశంలోకి ప్రవేశించారని గుర్తించారు.
కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్రకారం మయన్మార్ నుంచి మణిపూర్ (Manipur) వచ్చేవారికి సంబంధించి సరైన ధృవపత్రాలు పరిశీలించాల్సి ఉంది. విసా, ట్రావెల్ డాక్యుమెంట్స్ పరిశీలించాలి.. ఏ డాక్యుమెంట్ లేకున్నా రాష్ట్రంలోకి అనుమతించొద్దు అని అసోం రైఫిల్స్‌కు మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే 718 మంది ఇండో మయన్మార్ సరిహద్దు ద్వారా మణిపూర్‌లోకి (Manipur) శరణార్ధులు ప్రవేశించారని చందెల్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు అసోం రైఫిల్స్ సమాచారం అందజేసింది. ఖామ్పేటలో ఘర్షణలు జరుగుతోన్న క్రమంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సరైన పత్రాలు లేకుండా 718 మందిని దేశంలోకి ఎలా అనుమతి ఇచ్చారనే అంశంపై అసోం రైఫిల్స్ వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ 718 మందిని వెంటనే వెనక్కి పంపించాలని స్పష్టంచేసింది. ఆ 718 మందికి సంబంధించి ఫోటోలు, బయోమెట్రిక్ కూడా తీసుకోవాలని చందెల్ డీసీపీకి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఓ మహిళను కొందరు కలిసి హతమార్చారనే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ వీడియో ఫేక్ అని.. మణిపూర్ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.