Yellow alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో భారీ వర్షపాతం నమొదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, రెండు రోజులపాటు విస్తారంగా పడే ఈ వర్షం భారీ వర్షంగా మారే ప్రమాదం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.1డిగ్రీలు, గాలిలో తేమ 58శాతంగా నమోదైనట్లు దీన్ని బట్టి కూడా శుక్రవారం, శనివారం నగరంలోని లోతట్టు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇప్పటికే బలపడిన వాయుగుండం తీరరేఖ వెంబడి ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.