KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్ఎండ్బీ రోడ్ల పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని బుధవారం అధికారులు ఆదేశించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు స్థలం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేకుల షెడ్లు, డబ్బాలు, షాపులు, తదితరాలను జనవరి 10, 2026 ఆదివారం లోపు స్వచ్ఛందంగా తొలగించాలన్నారు.