W.G: విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ పాకా సత్యనారాయణ అన్నారు. భీమవరంలో 3 రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలను బుధవారం వారు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 100 టీంలు పాల్గొనడం సంతోషకరమన్నారు.