»The Congress Mp Rajkumar Roth Came On A Camel To Take Oath And Was Stopped By The Staff
MP Rajkumar Roth: ప్రమాణ స్వీకారానికి ఒంటెపై వచ్చిన ఎంపీ.. అడ్డుకున్న సిబ్బంది
లోక్ సభలో ప్రమాణ స్వీకారాల పర్వం కొనసాగుతుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎన్నుకోబడిని ఎంపీలు తమ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణతో పార్లమెంటుకు వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రాజ్ కుమార్ రోట్‌ను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.
The Congress MP Rajkumar Roth came on a camel to take oath and was stopped by the staff
MP Rajkumar Roth: పార్లమెంట్లో రెండు రోజులుగా ప్రమాణస్వీకార (Oath Taking ceremony) కార్యక్రమం కొనసాగుతుంది. దీనికోసం గెలిచిన ఎంపీలు తమ ప్రాంత సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎంపీలు తమ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణతో పార్లమెంటుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kihan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay), రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా పంచెకట్టులో పార్లమెంటుకు వచ్చారు. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఒంటెపై వచ్చిన ఎంపీ రాజ్‌కుమార్ రోట్‌ను పార్లమెంట్ అవరణంలోకి అనుమతించలేదు.
రాజస్థాన్‌కు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్ రోట్ ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటెను ఇంతకంటే ముందుకు అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. గతంలో దివంగత ప్రధాని వాజ్‌పేయీ ఎద్దుల బండిలో పార్లమెంట్‌కు వస్తే అనుమతిచ్చారు అని తాను ఒంటెపై వస్తే తప్పేంటి? అని రాజ్‌కుమార్ నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్ సపోర్టుతో బాన్స్వారా లోక్‌సభ స్థానం నుంచి రోట్ విజయం సాధించారు.