ELR: పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పోలవరంలో అధికారులను ఆదేశించారు. పునరావాస ప్యాకేజీ అమలుపై ప్రతి నెల సమీక్షిస్తామని, నెలవారీ లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఐకానిక్ బ్రిడ్జితో పాటు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.