Arrest warrant issued against former SIB chief Prabhakar Rao, key accused in phone tapping case
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్ జారీ అయింది. పోలీసులు సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే నోటీసులు జారీ చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. వారు ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకు రాగానే ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారు. దాంతో ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక ప్రభాకర్ ఏ ఎయిర్ పోర్టులో దిగినా పట్టుకునేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ప్రభాకర్ రావును పట్టుకునేందుకు ఇంటర్ పోల్ అధికారుల దర్యాప్తు బృందం అనుమతి తీసుకోవాలంటే కోర్టు అనుమతి కావాలి.