Dharmapuri Arvind: కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరింది
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
Dharmapuri Arvind: బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అనుకుంటే వెంటనే ప్రభుత్వం పడిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ కూల్చవలసిన అవసరం లేదని, పార్టీ నేతలే కూల్చేస్తారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అర్వింద్ అన్నారు.
తెలంగాణతో పాటు దేశంలో అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారన్నారు. ఐదేళ్లలో ఎంపీగా ఉన్న తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. ఇంతకుముందు నిజమాబాద్ ఎంపీగా ఉన్న కవిత ఇప్పుడు జైలులో ఉన్నారని అర్వింద్ అన్నారు. అవినీతి చేయాల్సి వస్తే ఆరోజు రాజకీయాలను వదిలేస్తా కానీ తప్పు మాత్రం చేయనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అందుకే పనులు సరైన సమయానికి కావట్లేదన్నారు.