TG: ATA వేడుకల్లో మాజీమంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ‘USలో కంటే HYDలోనే డబ్బులు ఎక్కువ’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వచ్చాక వీసా ఫీజులు పెంచేశాడని, జపాన్, చైనాలో అంతా ముసలివాళ్లే ఉన్నారని, మనకే యూత్ పవర్ ఉందని అన్నారు. చిన్న చిన్న సేవలు కాదు.. పుట్టిన ఊరికి గుర్తుండిపోయే పనులు చేయాలని, ఐటీ పరిశ్రమలు పెట్టాలని ఎన్నారైలకు సూచించారు.