»Ktr Ktr Legal Notices To Congress Leaders Accused In Phone Tapping Case
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తనపై ఆరోపణలు చేసిన వాళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు.
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తనపై ఆరోపణలు చేసిన వాళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నా పరువుకు నష్టం కలిగించిన కాంగ్రెస్ మంత్రితో పాటు పార్టీ నేతలు యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్‌కు నోటీసులు పంపిస్తానని కేటీఆర్ అన్నారు. అలాగే వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిన సంస్థలకు కూడా నోటీసులు ఇస్తామని కేటీఆర్ అన్నారు.
Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander
Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences