AP: తన హయాంలో తొలి మెడికల్ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తయిందని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విజయనగరంలో స్వయంగా, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను వర్చువల్గా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. మిగిలిన 12 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు.