AP: రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సులో CM చంద్రబాబు సమీక్షించారు. ‘సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించాలి. RORకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. గత పాలకుల తప్పులతో రాష్ట్రంలో భూవివాదాలు వచ్చాయి. GST సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.8 వేల కోట్ల ప్రయోజనం. GST తగ్గింపు ప్రయోజనాలపై నెలపాటు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి’ అని సూచించారు.