KMM: మధిర జాలిమూడి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం రూ. 5.41 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులను విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.