VSP: భారత్లో నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ తన ప్రతినిధి బృందంతో కలిసి మంగళవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించారు. పోర్టు డిప్యూటీ ఛైర్పర్సన్ దుర్గేష్ కుమార్ దూబే బృందానికి స్వాగతం పలికారు. పోర్టులోని కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ చర్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలను ఆయన బృందానికి వివరించారు.