NGKL: నాగర్ కర్నూల్ లైబ్రరీలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని మంగళవారం పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, కలెక్టర్ బడావత్ సంతోష్‌తో కలిసి ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, పరిశోధకులకు ఈ-బుక్స్, ఆన్లైన్ లెర్నింగ్ మెటీరియల్, కంప్యూటర్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.