MDK: పాపన్నపేట మండల పరిధిలోని కొడపాక రిజర్వ్ ఫారెస్ట్ అక్రమంగా సాగుచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి భూమిని ఫారెస్ట్ ఆధీనంలోకి తీసుకున్నట్లు మెదక్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుతుబుద్దీన్ తెలిపారు. అన్నారం గ్రామానికి చెందిన కుర్తివాడ రాజు ఫారెస్ట్ ఒక ఎకరా భూమిని సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి గుడిసెను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు.