ADB: అందరి సమిష్టి కృషితోనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సాధ్యమని మండల విద్యాశాఖ అధికారి భూమారెడ్డి పేర్కొన్నారు. నేరదిగోండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని కాంప్లెక్స్ హెచ్ఎంలతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.