AP: తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో TTD మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ముందుగా వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చేది. కానీ టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీడిప్ సిస్టమ్ ద్వారా విడుదలవుతాయని తెలిపింది. డిసెంబరు నెలకు సంబంధించిన టోకెన్లకు ఈ నెల 18 నుంచి 20వ వరకు లక్కీడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.