AP: పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కోడెల శివప్రసాద్ రావు వినుకొండ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారని జీవీ కొనియాడారు.